యోగాతో బహుళ ప్రయోజనాలు
ABN , Publish Date - May 21 , 2025 | 11:45 PM
యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు చేకూరతాయని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. యోగాంధ్ర- 2025లో భాగంగా బుధవారం స్థానిక తలారిసింగి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ముందస్తు ప్రారంభ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచన
పాడేరు, మే 21(ఆంధ్రజ్యోతి): యోగా సాధనతో బహుళ ప్రయోజనాలు చేకూరతాయని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. యోగాంధ్ర- 2025లో భాగంగా బుధవారం స్థానిక తలారిసింగి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన ముందస్తు ప్రారంభ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడారు. యోగా సాధనతో మానసిన, శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని, ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతాయన్నారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని, యోగాంధ్ర- 2025 పేరిట అప్పటి వరకు జరిగే యోగా శిక్షణలు, ప్రదర్శనలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు.
ఉత్తమ యోగ సాధకులకు అవార్డులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తమ యోగా సాధకులకు అవార్డులను ప్రదానం చేస్తామని కలెక్టర్ తెలిపారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన మాస్టర్ ట్రైనర్లను గుర్తించి వారి ద్వారా అందరికీ అవసరమైన శిక్షణలు అందించాలన్నారు. ఐటీడీఏ పీవోలతో డివిజన్, ఎంపీడీవోలతో మండల, పంచాయతీ కార్యదర్శులుతో పంచాయతీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి వాడవాడలా యోగాపై ప్రజలు, ఆసక్తి ఉన్న వారికి శిక్షణలు అందించాలన్నారు. యోగాపై ఆయా ప్రాంతాల్లో పోటీలను నిర్వహించాలని, యోగా నిత్య జీవితంలో భాగమయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి పద్మలత, డీఎంహెచ్‌వో జమాల్ బాషా, డీఈవో పి.బ్రహ్మాజిరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, హౌసింగ్ ఈఈ బి.బాబు, టీడబ్ల్యూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.