Share News

ఆటో నడిపిన ఎంపీ సీఎం రమేశ్‌

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:02 AM

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ ఖాకీ చొక్కా ధరించి కొద్ది సేపు ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తారు. శనివారం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ రమేశ్‌, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర ఖాకీ చొక్కాలు ధరించారు.

ఆటో నడిపిన ఎంపీ సీఎం రమేశ్‌
ఎంపీ సీఎం రమేశ్‌ ఆటో నడుపుతుండగా ప్రజలకు అభివాదం చేస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ప్రయాణించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర

నర్సీపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ ఖాకీ చొక్కా ధరించి కొద్ది సేపు ఆటో డ్రైవర్‌ అవతారం ఎత్తారు. శనివారం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ రమేశ్‌, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర ఖాకీ చొక్కాలు ధరించారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో సెల్ఫీలు దిగడానికి ఆటో డ్రైవర్లు ఎగబడ్డారు. నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డు వరకు ఎంపీ సీఎం రమేశ్‌ డ్రైవర్‌ సీట్లో కూర్చొని ఆటో నడిపారు. స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆటోలో కూర్చున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ నర్సీపట్నం నుంచి పెదబొడ్డేపల్లి మార్కెట్‌ యార్డు వరకు ఆటోలో ప్రయాణించారు.

Updated Date - Oct 05 , 2025 | 12:02 AM