Share News

మిట్టల్‌ స్టీల్స్‌లో కదలిక

ABN , Publish Date - Jun 26 , 2025 | 01:05 AM

జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూముల కేటాయింపు, ఇతర మౌలిక వసతుల కల్పనకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పరిపాలన పరమైన ఆమోదం తెలిపింది. కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 ప్రకారం ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నక్కపల్లి మండలంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో మెసర్స్‌ ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ సంస్థ 17.8 మిలియన్‌ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నది.

మిట్టల్‌ స్టీల్స్‌లో కదలిక
నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ భూముల నుంచి జాతీయ రహదారికి నిర్మిస్తున్న రెండు వరుసల రోడ్డు

నక్కపల్లి మండలంలో ఉక్కు ఫ్యాక్టరీకి భూ కేటాయింపు, మౌలిక వసతుల కల్పనకు ప్రోత్సాహకాలు

మంత్రివర్గ సమావేశంలో ప్రకటించిన ప్రభుత్వం

రెండు దశల్లో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌

రూ.1,35,000 కోట్ల పెట్టుబడి

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 17.8 మిలియన్‌ టన్నులు

2029నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం

ఏపీఐఐసీ భూముల్లో ఇప్పటికే మొదలైన మౌలిక వసతుల పనులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు భూముల కేటాయింపు, ఇతర మౌలిక వసతుల కల్పనకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో పరిపాలన పరమైన ఆమోదం తెలిపింది. కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 ప్రకారం ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నక్కపల్లి మండలంలోని ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో మెసర్స్‌ ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ సంస్థ 17.8 మిలియన్‌ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నది. మొదటి దశలో 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో, రెండో దశలో 10.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ నిర్మించనున్నది. రెండు దశల్లో రూ.1,35,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. మొత్తం 55 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మొదటి దశ ఉత్పత్తి 2029 నాటికి రెండో దశ ఉత్పత్తి 2033 నాటికి మొదలవుతుందని సంస్థ ఇప్పటికే సమగ్ర పథక నివేదిక (డీపీఆర్‌)ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ)కు సమర్పించింది. ఎకరా రూ.51,39,690 ధర చొప్పున 2,080 ఎరాలను మిట్టల్‌ స్టీల్స్‌కు కేటాంచనున్నది. 12 నెలల వ్యవధిలో మూడు విడతలుగా ఈ సొమ్మును ఏపీఐఐసీకి చెల్లించేలా ఒప్పందం జరగనున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే జిల్లాలో మిట్టల్‌ స్టీల్‌ వంటి భారీ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చేసిన కృషి అభినందనీయమని నిరుద్యోగ యువత, విద్యార్థులు అంటున్నారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నరసింహారావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, మిట్టల్‌ స్టీల్స్‌కు భూ కేటాయింపు, ఇతర రాయితీలను మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మార్గదర్శకాలు రాగానే అమలు చేస్తామన్నారు. నక్కపల్లి ఏపీఐఐసీ భూముల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు జరగుతున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - Jun 26 , 2025 | 01:05 AM