Share News

ప్రధాని మోదీ సారఽథ్యంలో దేశానికి మరింత గుర్తింపు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:00 AM

వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దేశానికి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తేవాలన్నదే ధ్యేయమని పార్లమెంటు రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ పాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ సారఽథ్యంలో  దేశానికి మరింత గుర్తింపు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రమేశ్‌. పక్కన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామిని

జీడీపీలో మూడో స్థానంలోకి తీసుకెళ్లడమే లక్ష్యం

వికసిత్‌ భారత్‌తో అనిఇ్న రంగాల్లో అభివృద్ధి

అమరావతిని నాశనం చేసిన జగన్‌కు జనం బుద్ధి చెప్పారు

అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌

అనకాపల్లి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దేశానికి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తేవాలన్నదే ధ్యేయమని పార్లమెంటు రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ పాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు దేశం పలు రంగాల్లో వెనుకబడి వుందన్నారు. తరువాత ప్రధాని మోదీ నాయకత్వంలో వివిధ రంగాల్లో అభివృద్ధి పరుగులు తీసిందన్నారు. జీడీపీలో భారత్‌ను నాలుగో స్థానానికి చేర్చారని, మూడు స్థానంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక విజన్‌తో ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌ల ఆధునికీకరణ పనులు జరగుతున్నాయన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు ఎంపీ రమేశ్‌ చెప్పారు. అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య ప్రస్తుతం వున్న నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించడానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఆదుకోవడానికి కేంద్రం ప్రభుత్వం రూ.11,500 కోట్లు సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

గతంలో టీడీపీ అధికారంలో వున్న ఐదేళ్లలో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు, అధికారుల నివాసగృహాల నిర్మాణ పనులు చేపట్టగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని జగన్‌ సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ప్లాంట్‌, బల్క్‌డ్రగ్‌ పార్కు, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానున్నాయని, భవిష్యత్‌లో మరిన్ని ప్రాజెక్టులు, కంపెనీలు రానున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదినేని యామిని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 01:00 AM