Share News

జిల్లాలో మోస్తరు వర్షం

ABN , Publish Date - May 21 , 2025 | 01:09 AM

జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రాగల మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

జిల్లాలో మోస్తరు వర్షం
కోటవురట్లలో మెయిన్‌రోడ్డులో నిలిచిపోయిన వర్షపు నీరు

- రాగల మూడు రోజుల్లో విస్తారంగా కురిసే అవకాశం

అనకాపల్లి, మే 20 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం వరకు వాతావరణం చల్లబడి, అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రాగల మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో మొత్తం వర్షపాతం 313.6 మిల్లీమీటర్లు వర్షం కురవగా, సగటు వర్షపాతం 13.1 మిల్లీ మీటర్లు నమోదైంది. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా అచ్యుతాపురం మండలంలో 55.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా నాతవరం మండలంలో 2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గొలుగొండ మండలంలో వర్షం కురవలేదు. రాంబిల్లి మండలంలో 45.2 మిల్లీ మీటర్లు, ఎలమంచిలిలో 30, చీడికాడలో 21.4, నక్కపల్లిలో 19.8, అనకాపల్లిలో 16,6, పరవాడలో 15.4, ఎస్‌.రాయవరంలో 15.2, పాయకరావుపేటలో 14.2, సబ్బవరంలో 11.8, మాడుగులలో 10.4, మునగపాకలో 6.8, చోడవరంలో 6.4, బుచ్చెయ్యపేటలో 6.2, దేవరాపల్లిలో 5.8, మాకవరపాలెంలో 5.6, రావికమతంలో 5.4, కె.కోటపాడులో 5.4, కోటవురట్లలో 4.6, రోలుగుంటలో 3.8, కశింకోటలో 3.6, నర్సీపట్నంలో 2.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు మండలాల్లో తేలిక పాటి వర్షపు జల్లులు కురిశాయి.

Updated Date - May 21 , 2025 | 01:09 AM