మోదకొండమ్మ ఆలయం కిటకిట
ABN , Publish Date - Jul 13 , 2025 | 11:12 PM
పాడేరు మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
ఘటాల పండుగను చేసిన భక్తులు
సందడిగా ఆలయ ప్రాంగణం
అమ్మవారి ప్రత్యేక పూజలు
పాడేరురూరల్, జూలై 13(ఆంధ్రజ్యోతి): పాడేరు మోదకొండమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి వందలాది మంది భక్తులు భారీ ఊరేగింపుగా తరలివచ్చి ఘటాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండగను జరుపుకున్నారు. సాయంత్రం వరకు భక్తులు ప్రాంగణంలో గడపడంతో ఆలయం భక్తులతో కళకళలాడింది. అదేవిధంగా పాడేరు ఘాట్ మార్గంలోని మోదాపల్లి జంక్షన్ వద్ద గల అమ్మవారి పాదాలకు వందలాది మంది భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలను చేపట్టి మొక్కులు తీర్చుకున్నారు.