Share News

ఘనంగా మోదకొండమ్మ పందిరి రాట ఉత్సవం

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:37 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజన ప్రాంత ప్రజల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ రాష్ట్ర ఉత్సవం సందర్భంగా సతకంపట్టు వద్ద బుధవారం పందిరి రాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మోదకొండమ్మ పందిరి రాట ఉత్సవం
సతకంపట్టు వద్ద పందిరి రాట పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, గిరిజన ప్రాంత ప్రజల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ రాష్ట్ర ఉత్సవం సందర్భంగా సతకంపట్టు వద్ద బుధవారం పందిరి రాట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ మోదకొండమ్మ రాష్ట్ర మహోత్సవాన్ని వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు వంజంగి కాంతమ్మ, పలాసి కృష్ణారావు, కిల్లు గంగన్నపడాల్‌, కొట్టగుళ్లి సుబ్బారావు, బొర్రా నాగరాజు, కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, జీకేవీధి జడ్పీటీసీ సభ్యురాలు కె.శివరత్నం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:37 PM