Share News

మోదకొండమ్మ జాతర రేపు

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:36 AM

మాడుగుల మోదకొండమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి ఏటా జూన్‌ నెలలో వచ్చే మొదటి మంగళవారం అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.

మోదకొండమ్మ జాతర రేపు

మాడుగుల, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): మాడుగుల మోదకొండమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి ఏటా జూన్‌ నెలలో వచ్చే మొదటి మంగళవారం అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు నెల రోజుల ముందు ప్రధాన ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం, పాదాలు, ఘటాలను ఊరేగింపుగా శతకంపట్టు వద్దకు తీసుకెళ్లి కొలువు తీర్చడం సంప్రదాయం. ప్రస్తుతం శతకం పట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. మూడో తేదీ సాయంత్రం అమ్మవారి విగ్రహం, పాదాలు, ఘటాలను ఊరేగింపుగా తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. అమ్మవారి జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు తెలిపారు.

Updated Date - Jun 02 , 2025 | 12:36 AM