Share News

చోడవరం పంచాయతీ ఈవోపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:34 AM

రహదారి పక్కన వుండే దుకాణదారులు క్రమేపీ రోడ్డును ఆక్రమించి మరీ ముందుకు వచ్చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పంచాయతీ ఈవో శ్రీనివాస్‌పై మండిపడ్డారు. శనివారం పట్టణంలోని లక్ష్మీపురం రోడ్డులో పర్యటన సందర్భంగా ఆయన పలుచోట్ల రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న దుకాణదారులను చూశారు.

చోడవరం పంచాయతీ ఈవోపై ఎమ్మెల్యే ఆగ్రహం
పంచాయతీ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే రాజు

వ్యాపారులు రోడ్డును ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీత

దుకాణదారుల తీరుపై అసంతృప్తి

డ్రైనేజీ కాలువలపై కట్టడాలను తొలగించాలని ఆదేశం

చోడ వరం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రహదారి పక్కన వుండే దుకాణదారులు క్రమేపీ రోడ్డును ఆక్రమించి మరీ ముందుకు వచ్చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, పంచాయతీ ఈవో శ్రీనివాస్‌పై మండిపడ్డారు. శనివారం పట్టణంలోని లక్ష్మీపురం రోడ్డులో పర్యటన సందర్భంగా ఆయన పలుచోట్ల రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేస్తున్న దుకాణదారులను చూశారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపైకి వచ్చి మరీ దుకాణాలు పెడుతుంటే చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. రోడ్డు పక్క దుకాణాలు పెట్టుకోవడానికి తాను అడ్డు చెప్పడం లేదని, కానీ రోడ్డును ఆక్రమించి, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి వెంటనే తొలగించాలని ఆదేశించారు.

Updated Date - Dec 07 , 2025 | 12:34 AM