Share News

నేడు మంత్రి గొట్టిపాటి జిల్లా పర్యటన

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:54 AM

రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. 10 గంటలకు ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 10.45 గంటలకు కె.కోటపాడు మండలం చౌడువాడ చేరుకుని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.

నేడు మంత్రి గొట్టిపాటి జిల్లా పర్యటన
మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించనున్న కింతలి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌

చైడువాడ, కింతలిలో కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ప్రారంభించనున్న రవికుమార్‌

అనకాపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. 10 గంటలకు ఈపీడీసీఎల్‌ సర్కిల్‌ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 10.45 గంటలకు కె.కోటపాడు మండలం చౌడువాడ చేరుకుని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు మాడుగుల మండలం కింతలిలో సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం విశాఖపట్నం వెళతారు.

మూడు నెలల్లో రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణం!

కె.కోటపాడు, మాడుగుల మండలాల్లోని పలు గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య చాలా కాలం నుంచి వుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లను మంజూరు చేయించారు. చౌడువాడలో రూ.3.7 కోట్లతో, కింతలిలో రూ.3.31 కోట్లతో ఈ ఏడాది ఆగస్టులో సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు చేపట్టి అక్టోబరు చివరినాటికి పూర్తి చేశారు. చౌడువాడ సబ్‌స్టేషన్‌తో చౌడువాడ, గరుగుగబిల్లి, మల్లంపాలెం, పైడమ్మపేట, పాచిలవానిపాలెం, గుల్లేపల్లి; కింతలి సబ్‌స్టేషన్‌తో కింతలి, కింతలి వల్లాపురం, పొంగలిపాక, జాలంపల్లి, అవురువాడ పంచాయతీల్లో విద్యుత్‌ వినియోగదారులకు లోఓల్టేజీ సమస్య తీరుతుంది.

Updated Date - Nov 05 , 2025 | 12:54 AM