మంత్రి లోకేశ్ 22న అరకులోయ రాక
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:18 AM
రాష్ట్ర మానవ వనరుల (విద్య) శాఖా మంత్రి నారా లోకేశ్ ఈ నెల 22వ తేదీన అరకులోయ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా ఏదో ఒక క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేస్తారని జిల్లా విద్యా శాఖాధికారి బ్రహ్మాజీ చెప్పారు.
క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ తనిఖీ
డీఈవో బ్రహ్మాజీ వెల్లడి
అరకులోయ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరుల (విద్య) శాఖా మంత్రి నారా లోకేశ్ ఈ నెల 22వ తేదీన అరకులోయ పర్యటనకు వస్తున్నారని, ఈ సందర్భంగా ఏదో ఒక క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేస్తారని జిల్లా విద్యా శాఖాధికారి బ్రహ్మాజీ చెప్పారు. శుక్రవారం ఇక్కడకు వచ్చిన ఆయన ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కంఠబౌంసుగుడ బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, రవ్వలగుడ జీటీడబ్ల్యూఎస్ బాలుర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు మోహన్‌రావు, ఎల్‌బీ దయానిధి, టి.నాగేశ్వరరావులకు పలు సూచనలు చేశారు. మంత్రి నారా లోకేశ్ ఈ నెల 22వ తేదీన ఈ మూడు పాఠశాలల్లో ఏదో ఒకదానిని సందర్శించే అవకాశం వుందన్నారు. అనంతరం ఆయన అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎంఈవోలు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలతో సమావేశమయ్యారు. డీఈవో వెంట డిప్యూటీ డీఈవో చల్లయ్య, తదితరులు వున్నారు.