Share News

మెట్రో ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై పునఃసమీక్ష

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:11 AM

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై పునఃసమీక్ష చేస్తామని, అధ్యయనానికి కమిటీని వేస్తామని డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బుధవారం మంగళగిరిలో ఆయన్ను కలిశారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు పదేళ్ల క్రితం సర్వే చేశారని, ఆ తరువాత విశాఖలో అనేక మార్పులు జరిగాయని, పాత అలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు చేపడితే చాలా మంది ఇబ్బంది పడతారని ఎండీ రామకృష్ణారెడ్డికి వివరించారు.

మెట్రో ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై పునఃసమీక్ష
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ గురించి వివరిస్తున్న ఎండీ రామకృష్ణారెడ్డి

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఎండీ హామీ

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్‌మెంట్‌పై పునఃసమీక్ష చేస్తామని, అధ్యయనానికి కమిటీని వేస్తామని డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బుధవారం మంగళగిరిలో ఆయన్ను కలిశారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు పదేళ్ల క్రితం సర్వే చేశారని, ఆ తరువాత విశాఖలో అనేక మార్పులు జరిగాయని, పాత అలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు చేపడితే చాలా మంది ఇబ్బంది పడతారని ఎండీ రామకృష్ణారెడ్డికి వివరించారు. ప్రజలు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. దానికి స్పందించిన ఎండీ ఒక కమిటీని వేసి క్షేత్ర పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వివరాలను ఎమ్మెల్యేకు క్షుణ్ణంగా వివరించారు. జూలై 16 నుంచి 18 వరకు వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించగా, 204 కుటుంబాలు ప్రభావితం అవుతాయని, మరో 108 కుటుంబాలు నిర్వాసితులు అవుతారని గుర్తించామన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 01:11 AM