Share News

మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:46 AM

స్థానిక మెయిన్‌రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించి ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ఆయా కంపెనీల నియామక పత్రాలను అందజేశారు.

మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన
నియామకపు పత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే కొణతాల

అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక మెయిన్‌రోడ్డులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించి ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ఆయా కంపెనీల నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు నెలల క్రితం నిర్వహించిన జాబ్‌మేళాలో 106 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారన్నారు. ఈ దఫా 30 కంపెనీల వరకు ఈ జాబ్‌మేళాలో పాల్గొన్నాయన్నారు. ఈ జాబ్‌మేళాలో పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు పాల్గొన్నారన్నారు. 1,560 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వీరిలో 587 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్‌.గోవిందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సబ్బవరపు గణేశ్‌, నూకాంబిక ఆలయ మాజీ చైర్మన్లు పీలా నాగశ్రీను, బీఎస్‌ఎంకే జోగినాయుడు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:46 AM