Share News

26 నుంచి మీజిల్స్‌, రుబేల్లా టీకాలు

ABN , Publish Date - May 23 , 2025 | 12:50 AM

అనకాపల్లి జిల్లాలో ఈ నెల 26 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీజిల్స్‌, రుబేల్లా వ్యాక్సిన్‌ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నామని డీఎం అండ్‌ హెచ్‌వో ఎం.శాంతిప్రభ తెలిపారు.

26 నుంచి మీజిల్స్‌, రుబేల్లా టీకాలు
డీఎం అండ్‌ హెచ్‌వో శాంతిప్రభ డీఎం హెచ్‌వో శాంతిప్రభ

అనకాపల్లి టౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో ఈ నెల 26 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీజిల్స్‌, రుబేల్లా వ్యాక్సిన్‌ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నామని డీఎం అండ్‌ హెచ్‌వో ఎం.శాంతిప్రభ తెలిపారు. ఈ నెల 26 నుంచి మూడు విడతలుగా జిల్లాలో వ్యాక్సిన్‌ వేయించని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వేస్తామన్నారు. మొదటి విడతగా మే 26 నుంచి 31వ తేదీ వరకు, రెండో విడత జూన్‌ 23 నుంచి 28వ తేదీ వరకు, మూడో విడత జూలై 21 నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక వ్యాక్సిన్‌ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పీహెచ్‌సీలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ల్లో టీకాలు వేస్తామన్నారు. మీజిల్స్‌, రుబేల్లా వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరంతో కూడిన నిమోనియా వ్యాధి సోకడంతో ఒంటిపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో శారీరక ఎదుగుదల తగ్గుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మీజిల్స్‌, రుబేల్లా ఈ మధ్యకాలంలో పిల్లలకు సోకిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్‌ వేయించని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ వేయించాలని ఆమె కోరారు.

Updated Date - May 23 , 2025 | 12:50 AM