నేడు భారీగా రైళ్లు రద్దు
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:07 AM
తుఫాన్ నేపథ్యంలో వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఈ నెల 28, 29 (మంగళ, బుధవారాలు) తేదీల్లో పలు రైళ్లను రద్దు చేశారు.
జాబితాలో ‘ప్రశాంతి’, ‘విశాఖ’, తిరుపతి-విశాఖ స్పెషల్, పలు పాసింజర్ రైళ్లు
రేపు కూడా కొన్ని...
మరికొన్ని దారిమళ్లింపు, గమ్యాల కుదింపు
విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ నేపథ్యంలో వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఈ నెల 28, 29 (మంగళ, బుధవారాలు) తేదీల్లో పలు రైళ్లను రద్దు చేశారు.
మంగళవారం రద్దయిన రైళ్లు: విశాఖ-కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్ (18516), విశాఖ-కిరండూల్ పాసింజర్ (585801), కిరండూల్-విశాఖ పాసింజర్ (58502), విశాఖ-కొరాపుట్ పాసింజర్ (58538), కొరాపుట్-విశాఖ పాసింజర్ (58537), కొరాపుట్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18511), రాజమండ్రి-విశాఖ మెము పాసింజర్ (67285), విశాఖ-రాజమండ్రి మెము (67286), విశాఖ-కాకినాడ (17268), కాకినాడ-విశాఖ (17267), తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు (08584), విశాఖ-గుంటూరు డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22875), గుంటూరు-విశాఖ డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22876), బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18525), విశాఖ-పలాస మెము (67289), పలాస-విశాఖ మెము (67290), విజయనగరం-విశాఖ మెము (67288), కటక్-గుణుపూర్ మెము (68433), బ్రహ్మపూర్-విశాఖ పాసింజర్ (58531), విశాఖ-బ్రహ్మపూర్ పాసింజర్ (58532), విశాఖ-గుణుపూర్ పాసింజర్ (58506), గుణుపూర్-విశాఖ పాసింజర్ (58505), మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (12862), భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి (18463), భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015), భువనేశ్వర్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ (20851)
బుధవారం రద్దయిన రైళ్లు: గుణుపూర్-కటక్ మెము (68434), న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806), విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌పెస్ (18520)
ఇక టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ (18189)ను మంగళవారం దారిమళ్లించి టిట్లాగర్, రాయపూర్, నాగపూర్, బలార్ష మీదుగా నడపనున్నారు. అలాగే భువనేశ్వర్-జగదల్‌పూర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447), రూర్కెలా-జగదల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లు (18107) రాయగడ వరకు నడిచేలా గమ్యాలను కుదించారు.
సోమవారం యథావిధిగా బయలుదేరిన రైళ్లు
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించామని రైల్వే అధికారులు ప్రకటించారు. విశాఖ-తిరుపతి స్పెషల్ (08583), విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707), విశాఖ-మచిలీపట్నం (17220), విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727), విశాఖ-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12861), విశాఖ-చెన్నై సెంట్రల్ (22869), విశాఖ-సికింద్రాబాద్ గరీబ్‌రథ్ (12739), విశాఖ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806), విశాఖ-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ (18519) వంటి ఒరిజినేటింగ్ రైళ్లతోపాటు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243), రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) సోమవారం యథావిధిగా ఒరిజినేటింగ్ స్టేషన్ల నుంచి బయలుదేరాయి
ఆర్టీసీకి ఎఫెక్ట్
60 శాతానికి పడిపోయిన ఆక్యుపెన్సీ
60 బస్సులు రద్దు
రాత్రి 8 గంటల తరువాత దూర ప్రాంతాలకు బయలుదేరాల్సిన సర్వీస్‌లన్నీ క్యాన్సిల్
ద్వారకా బస్‌స్టేషన్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
‘మొంథా’ తుఫాన్ కారణంగా ప్రయాణికులు తగ్గడంతో ఆర్టీసీ విశాఖ రీజియన్ యాజమాన్యం సోమవారం 60 బస్సులు రద్దు చేసింది. మిగిలిన బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం మాత్రమే నమోదయ్యింది.
తుఫాన్ కారణంగా సోమవారం తెల్లవారుజామున భారీవర్షం పడడంతో షెడ్యూల్ ప్రకారం 4.00 గంటలకు వెళ్లాల్సిన బస్సులు డిపోల నుంచి గంట ఆలస్యంగా బయలుదేరాయి. ఉదయం 7.00 గంటల వరకూ షెడ్యూల్ సర్వీస్‌లన్నీ 20 ఆక్యుపెన్సీ రేషియోతో తిరిగాయి. పరిస్థితి గమనించిన ఆర్టీసీ అధికారులు డిమాండ్ లేని రూట్లలో 50 బస్సులు రద్దు చేశారు. గుణుపూరు, పర్లాకిమిడి, పాడేరు, సీలేరు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ఘాట్ రోడ్లలో సర్వీసులను రద్దు చేశారు. సీలేరు, భద్రాచలం రోడ్లు బాగుండనందున ఆ రూట్‌లో తిరిగే సర్వీసులు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రాత్రికి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విశాఖ నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన నైట్ అవుట్ సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. రాత్రి 8.00 తరువాత దూర ప్రాంతాలకు బయలుదేరాల్సిన బస్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు రీజనల్ అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 8.00 గంటలమధ్య దూర ప్రాంతాలకు బయలుదేరిన బస్సులను ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ద్వారకా కాంప్లెక్స్‌లోని కంట్రోలర్లు పర్యవేక్షిస్తున్నారు.
60 శాతం ఓఆర్‌కే పరిమితం
మిగిలిన బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో 60 శాతంగా నమోదయ్యింది. సాధారణ రోజుల్లో 85 నుంచి 90 శాతం ఉన్న ఆక్యుపెన్సీ రేషియో సోమవారం 60 శాతానికి పడిపోయింది. రీజియన్‌లో ప్రస్తుతం 740 షెడ్యూల్ సర్వీసులు ఉండగా, అందులో 60 రద్దు చేయగా మిగిలిన 680 సర్వీసులు నడిపినా ఆక్యుపెన్సీ రేషియో పెద్దగా లేదు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఘాట్ రోడ్లు, గుంతల రోడ్లలో బస్సులు నడపొద్దు
బి.అప్పలనాయుడు, రీజనల్ మేనేజర్
ఘాట్‌రోడ్లు, వర్షం నీటితో నిండిన గుంతల రోడ్లలో బస్సులు నడపవద్దని డ్రైవర్లకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆదేశాలు జారీచేశారు. అలాంటి పరిస్థితి ఉంటే బస్సులను అందుబాటులో ఉన్న ఆర్టీసీ డిపోలో నిలిపివేయాలని సూచించారు. సంబంధిత సమాచారాన్ని ఆర్‌ఎం కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు చేరవేయాలని సూచించారు. ఎక్కడా రిస్క్ తీసుకోవద్దు, ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టవద్దని డ్రైవర్లకు సూచించారు.