Share News

లంకెలపాలెంలో భారీ చోరీ

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:48 AM

పరవాడ మండలం జీవీఎంసీ పరిధిలోని లంకెలపాలెంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ద్వారానికి వేసిన తాళాలను తీసి, బీరువాలో వున్న ఆరు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లంకెలపాలెం రామాలయం వీధికి చెందిన సూరిశెట్టి వెంకటలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మరణించడంతో కుమార్తె జయలక్ష్మితో కలిసి నివాసం వుంటున్నది.

లంకెలపాలెంలో భారీ చోరీ
బంగారం చోరీ చేసింది ఈ బీరువాలో నుంచే..

ఆరు తులాల బంగారు ఆభరణాలు అపహరణ

లంకెలపాలెం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పరవాడ మండలం జీవీఎంసీ పరిధిలోని లంకెలపాలెంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ద్వారానికి వేసిన తాళాలను తీసి, బీరువాలో వున్న ఆరు తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటనకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లంకెలపాలెం రామాలయం వీధికి చెందిన సూరిశెట్టి వెంకటలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మరణించడంతో కుమార్తె జయలక్ష్మితో కలిసి నివాసం వుంటున్నది. శనివారం ఉదయం తల్లీకుమార్తె పెందుర్తిలో బంధువుల ఇంటికి వెళుతూ, తమ ఇంటికి తాళాలు వేసి, చెవులను బంధువైన అప్పలరాజుకు ఇచ్చారు. ఆదివారం ఉదయం ప్రధాన ద్వారం, బెడ్‌రూమ్‌ తలుపులు తీసి ఉండడాన్ని అప్పలరాజు గుర్తించి, వెంటనే వెంకటలక్ష్మికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆమె హుటాహుటిన ఇంటికి వచ్చి, బీరువాను పరిశీలించారు. లాకర్‌లో భద్రపరిచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బీరువా తాళాలను కప్‌బోర్డులో వుంచి వెళ్లడంతో దొంగలు సులువుగా బంగారాన్ని అపహరించుకుపోయారు. అనంతరం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ప్రసాద్‌ వెళ్లి పరిశీలించి, వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌వచ్చి వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 12:48 AM