108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహం
ABN , Publish Date - May 31 , 2025 | 12:49 AM
108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహం
గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని తంగేటి శ్రీనివాస కల్యాణమండంలో శుక్రవారం 108 ఆదివాసీ జంటలకు సామూహిక వివాహ మహోత్సవాన్ని నిర్వహించారు. వికాస తరంగిణి కేంద్ర కమిటీ, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథులుగా హాజరై మంగళసూత్రాలు అందించి, వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు సమీపంలో వున్న అల్లూరి సీతారామరాజు పార్కుకు వెళ్లి అల్లూరి, గంటందొర సమాధులను, మ్యూజియంను తిలకించారు.