కాఫీ పండ్లకు మార్కెటింగ్ సదుపాయం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:23 PM
ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్(మ్యాక్స్) మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుందని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ తెలిపారు.
ఏ- గ్రేడ్ రూ.60, బీ- గ్రేడ్ రూ.55కు ధరలు చెల్లించాలని మ్యాక్స్ నిర్ణయం
ఐటీడీఏ పీవో శ్రీపూజ
చింతపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది ఆదివాసీ రైతులు పండించిన కాఫీ పండ్లకు ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్(మ్యాక్స్) మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుందని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏజెన్సీ పదకొండు మండలాల కాఫీ రైతులకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది ఆదివాసీ రైతులు మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకున్న కాఫీ పండ్లు కిలోకి తొలివిడతగా రూ.44 చెల్లించామని, కాఫీ పండ్లు విక్రయించగా వచ్చిన ఆదాయం నుంచి రెండు పర్యాయాలు రూ.8 చొప్పున బోనస్ చెల్లించామన్నారు. కిలోకి మొత్తంగా ఒక్కొక్క రైతుకి రూ.60 ధర అందించామన్నారు. ఈ ఏడాది కిలో కాఫీ పండ్లకు తొలివిడతగా ఏ-గ్రేడ్‌కి రూ.60, బీ-గ్రేడ్‌కి రూ.55 ధర చెల్లించేందుకు మ్యాక్స్ నిర్ణయించిందని తెలిపారు. కాఫీ పండ్లు పల్పింగ్ చేసి మార్కెటింగ్ చేయగా వచ్చిన లాభాలు ఆధారంగా అదనంగా బోనస్ చెల్లిస్తామన్నారు. గిరిజన రైతులు కాఫీ పండ్లను మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకుని గరిష్ఠ ధర పొందాలన్నారు. దళారులను ఆశ్రయించి నష్టపోరాదన్నారు. కాఫీ పండ్లకు మ్యాక్స్ ద్వారా మార్కెట్ సదుపాయం