గంజాయి స్మగ్లింగ్ ఆస్తులు రూ.1.4 కోట్లు సీజ్
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:48 PM
గంజాయి రవాణా, వ్యాపారం ద్వారా సంపాదించిన ఓ నిందితుడికి చెందిన రూ.1 కోటి 40 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేశామని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్
పాడేరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా, వ్యాపారం ద్వారా సంపాదించిన ఓ నిందితుడికి చెందిన రూ.1 కోటి 40 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేశామని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడు పెరుమల్ శ్రీను గంజాయి రవాణా, వ్యాపారం చేస్తుండడంతో అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం పాడువాలో, తెలంగాణ రాష్ట్రం దమ్మపేటలో గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. ఈక్రమంలో పెరుమల్ శ్రీనుపై ప్రత్యేక విచారణ చేపట్టి, ఆయనకున్న ఆస్తులను గుర్తించామన్నారు. చట్టప్రకారం ఆయన గంజాయి స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన రూ.1 కోటి 40 లక్షల ఆస్తులను సీజ్ చేశామని, వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా ఫ్రీజ్ చేశామన్నారు. అలాగే ప్రజలు ఏదైనా ఆస్తులను కొనుగోలు చేస్తున్న క్రమంలో వాటి యాజమాని గురించి పక్కాగా తెలుసుకోవాలని, లేకుంటే చట్టపరమైన చిక్కుల్లో పడతారన్నారు. అలాగే ముఖ్యంగా గంజాయి స్మగ్లర్ల ఆస్తులను ఎవరూ కొనుగోలు చేయవద్దని, ప్రజలు పోలీసులకు సహరించాలని ఎస్‌పీ అమిత్‌బర్దార్ తెలిపారు.