Share News

కనకమహాలక్ష్మి ఆలయంలో నేటి నుంచి మార్గశిర మాసోత్సవాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:48 AM

వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

కనకమహాలక్ష్మి ఆలయంలో నేటి నుంచి మార్గశిర మాసోత్సవాలు

ఉదయం 8.40 గంటలకు ప్రారంభం

మహారాణిపేట, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి మార్గశిర మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8.40 గంటలకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌, సీపీ శంఖబ్రతబాగ్చి ఎప్పటికప్పుడు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Nov 21 , 2025 | 12:48 AM