పాడేరు ఏఎంసీ చైర్‌పర్సన్‌గా మంగతల్లి నియామకం
ABN , Publish Date - Apr 16 , 2025 | 11:11 PM
స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్‌పర్సన్‌గా కొయ్యూరు మండలానికి చెందిన బీజేపీ మహిళా నేత మచ్చల మంగతల్లిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైౖర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొయ్యూరు మండలానికి చెందిన బీజేపీ నేతకు దక్కిన అవకాశం
పాడేరు, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్‌పర్సన్‌గా కొయ్యూరు మండలానికి చెందిన బీజేపీ మహిళా నేత మచ్చల మంగతల్లిని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైౖర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో టీడీపీ నేతలు 25 మంది, జనసేన నేతలు 4, బీజేపీ నేత ఒకరు కాగా.. ఆమె పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గిరిజన మహిళ కావడం విశేషం. కొయ్యూరుకు చెందిన మంగతల్లి 2016 నుంచి బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తుండడంతో గతంలో ఆమెను మండల మహిళా మోర్చ అధ్యక్షురాలిగా నియమించగా, ప్రస్తుతం మండల మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించి ఏఎంసీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను మరింత అంకితభావంతో నెరవేరుస్తూ గిరిజన రైతులకు తగిన సేవలందిస్తానని మంగతల్లి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన గిరిజన మహిళా నేతకు ఏఎంసీ పీఠం దక్కడంపై మన్యంలోని బీజేపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.