Share News

‘మేహాద్రిగెడ్డ’లో ఈతకు దిగి వ్యక్తి మృతి

ABN , Publish Date - May 25 , 2025 | 12:28 AM

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరా ప్రకారం ప్రహ్లా దపురానికి చెందిన దాసరి విజయ్‌కుమార్‌ (41) కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేసేవాడు. శనివారం మధ్యాహ్నం ఆయన స్నేహితులతో కలిసి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు ఈతకు వెళ్లాడు.

‘మేహాద్రిగెడ్డ’లో ఈతకు దిగి వ్యక్తి మృతి
విజయ్‌కుమార్‌ మృతదేహం

గోపాలపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి): మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఈతకు దిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరా ప్రకారం ప్రహ్లా దపురానికి చెందిన దాసరి విజయ్‌కుమార్‌ (41) కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేసేవాడు. శనివారం మధ్యాహ్నం ఆయన స్నేహితులతో కలిసి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌కు ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో స్పిల్‌వేకు కాస్త దూరంగా ఈదుకుంటూ వెళ్లాక విజయ్‌కుమార్‌కు ఆయాసం రావడంతో నీటిలో మునిగిపోయాడు. దీంతో స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్‌కుమార్‌ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా విజయ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:28 AM