ఎట్టకేలకు మంప పోలీస్ స్టేషన్‌కు సొంత గూడు
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:34 AM
ఎట్టకేలకు మంప పోలీస్ స్టేషన్‌కు సొంత గూడు సమకూరింది.
నిరాడంబరంగా భవనం ప్రారంభం
మూడు దశాబ్దాల తరువాత మోక్షం
కొయ్యూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మంప పోలీస్ స్టేషన్‌కు సొంత గూడు సమకూరింది. ఈ స్టేషన్ ఏర్పాటు నుంచి మూడు దశాబ్దాలుగా పరాయి పంచన కొనసాగుతుండగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనంలోకి ఇప్పుడు మారింది. మంప పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం ఉదయం చింతపల్లి ఏఎస్‌పీ నవజ్యోతి మిశ్రా ప్రారంభించారు. అయితే ఎటువంటి ఆర్భాటం లేకుండా దీనిని ప్రారంభించి కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కిషోర్‌వర్మ, మంప ఎస్‌ఐ శంకరరావుతో కలిసి ఆయన పూజలు చేశారు.