Share News

పాడేరులో పిచ్చి కుక్క స్వైరవిహారం

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:01 PM

పాడేరులో బుధవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. స్థానిక తలారిసింగి, చింతలవీధి మార్గంలో ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న ఎస్‌ఐ గోవిందరావుతో పాటు మరో పది మందిని కుక్క కరిచింది.

పాడేరులో పిచ్చి కుక్క స్వైరవిహారం
కుక్క కాటుకు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ గోవిందరావు

ఎస్‌ఐతో పాటు మరో పది మందిపై దాడి

పాడేరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పాడేరులో బుధవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. స్థానిక తలారిసింగి, చింతలవీధి మార్గంలో ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న ఎస్‌ఐ గోవిందరావుతో పాటు మరో పది మందిని కుక్క కరిచింది. ఇటీవల కాలంలో పాడేరు పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద అధికమైంది. ఈ నెల ఆరో తేదీన పాడేరు, నక్కలపుట్టు, సేరిబయలు ప్రాంతాలకు చెందిన 18 మందిని కుక్కలు కరిచాయి. ఇలా నిత్యం జిల్లా కేంద్రంలో ఏదొక ప్రాంతంలో కుక్కలు జనంపై దాడి చేసి గాయపరుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. పాడేరులో బుధవారం స్థానిక మెడికల్‌ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పిచ్చి కుక్క విచ్చలవిడిగా విహరించి అక్కడున్న మెడికల్‌ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, తదితరులను కరిచింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ గోవిందరావు చేయిపైన కుక్క కరిచేసింది. దీంతో వెంటనే ఆయన స్థానిక ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో ఇతర బాధితులు ఆస్పత్రిని ఆశ్రయించారు. పాడేరులో తరచూ కుక్కలు దాడులు చేస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:01 PM