Share News

ఉత్తమ పంచాయతీగా ఎం.జగన్నాథపురం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:48 AM

మండలంలోని ఎం.జగన్నాథపురం సర్పంచ్‌ కరెడ్ల బుల్లెమ్మ జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గురువారం విశాఖలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌.. ఆమెకు పురస్కారాన్ని అందజేసి, శాలువాతో సత్కరించారు.

ఉత్తమ పంచాయతీగా ఎం.జగన్నాథపురం
సర్పంచ్‌ బుల్లెమ్మను సన్మానించి పురస్కారాన్ని అందజేస్తున్న కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌. పక్కన జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, వైస్‌చైర్‌పర్సన్‌ బీవీ సత్యవతి

విశాఖ కలెక్టర్‌ నుంచి పురస్కారం అందుకున్న సర్పంచ్‌ బుల్లెమ్మ

అచ్యుతాపురం రూరల్‌, ఏప్రిల్‌ 24, (ఆంధ్రజ్యోతి):

మండలంలోని ఎం.జగన్నాథపురం సర్పంచ్‌ కరెడ్ల బుల్లెమ్మ జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గురువారం విశాఖలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌.. ఆమెకు పురస్కారాన్ని అందజేసి, శాలువాతో సత్కరించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఎం.జగన్నాఽథపురం పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధికి అన్ని విధాలా సహకరించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ తోడ్పాటుతో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, స్థానిక ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధిని చేస్తానని కరెడ్ల బుల్లెమ్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, వైస్‌చైర్‌పర్సన్‌ భీశెట్టి వరహా సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 12:48 AM