ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సీఈగా ఎల్‌వీ స్వామినాయుడు బాధ్యతలు
ABN , Publish Date - May 13 , 2025 | 12:46 AM
ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్‌గా ఎల్‌వీ స్వామినాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది గౌరవపూర్వకంగా ఆహ్వానం పలికారు.
సీలేరు, మే 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్‌గా ఎల్‌వీ స్వామినాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సీలేరు కాంప్లెక్సు పరిధిలోని జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది గౌరవపూర్వకంగా ఆహ్వానం పలికారు. గతంలో ఇక్కడ పని చేసిన సీఈ వాసుదేవరావు కడప ఆర్టీపీపీ స్టేషన్‌కి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో విజయవాడ విద్యుత్ సౌదా హెచ్‌పీసీలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న స్వామినాయుడును సీలేరు కాంప్లెక్సు సీఈగా బాధ్యతలు స్వీకరించాలని విజయవాడ విద్యుత్ సౌదా నుంచి ఆదేశాలు వెలువడడంతో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లు ఆయనను అభినందించారు.