వరాహావతారంలో జగన్నాథుడు
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:31 AM
రథోత్సవాల్లో భాగంగా వన్‌టౌన్‌లోని టర్నర్ చౌల్ర్టీలో జగన్నాథస్వామి సోమవారం భక్తులకు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు.
మహారాణిపేట, జూన్ 30 (ఆంధ్రజ్యోతి):
రథోత్సవాల్లో భాగంగా వన్‌టౌన్‌లోని టర్నర్ చౌల్ర్టీలో జగన్నాథస్వామి సోమవారం భక్తులకు వరాహ అవతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులు జగన్నాథస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి.రాజగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు తాగునీరు, ప్రసాదం, అన్న సమారాధన ఏర్పాటుచేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం జగన్నాథస్వామి నారసింహావతారంలో దర్శనమిస్తారు.