Share News

పాడేరు ఆర్డీవోగా లోకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:03 PM

స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా ఎంవీఎస్‌.లోకేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

పాడేరు ఆర్డీవోగా లోకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ
ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఎంవీఎస్‌.లోకేశ్వరరావుకు అభినందనలు తెలుపుతున్న సిబ్బంది

పాడేరు, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా ఎంవీఎస్‌.లోకేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన శార్యమన్‌పటేల్‌ను గత నెలలో ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమించారు. దీంతో ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ సబ్‌కలెక్టర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జాయింట్‌కలెక్టర్‌ అభిషేక్‌గౌడకు కూడా ఏలూరు బదిలీ కావడంతో ఆ బాధ్యతలను కూడా ఐటీడీఏ పీవో శ్రీపూజకు అప్పగించారు. ఈక్రమంలో ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎంవీఎస్‌.లోకేశ్వరరావుకు పాడేరు ఆర్డీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన శుక్రవారం ఆర్‌డీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్‌ పరిపాలనాధికారి కె.అప్పలస్వామి, డిప్యూటీ తహశీల్దార్లు వి.ధర్మరాజ్‌, సీహెచ్‌.కృష్ణారావు, వై.రామమూర్తి, ఆర్‌.రామమూర్తి, సిబ్బంది ఆయనకు అభినందనలు ెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 11:03 PM