Share News

నగరానికి లోకేశ్‌

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:02 AM

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించడానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకున్నారు.

నగరానికి లోకేశ్‌

గోపాలపట్నం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి):

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించడానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నగరానికి చేరుకున్నారు. ఆయన్ను ఎయిర్‌పోర్టులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు కలిశారు. అనంతరం నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత రోడ్డు మార్గంలో కాశీబుగ్గ బయలుదేరి వెళ్లారు.

Updated Date - Nov 02 , 2025 | 01:02 AM