సచివాలయాలకు తాళాలు
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:39 AM
సాగర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో ఉన్న మూడు సచివాలయాలు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తాళాలతో దర్శనమిచ్చాయి.
సాగర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో ఉన్న మూడు సచివాలయాలు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తాళాలతో దర్శనమిచ్చాయి. ఎనిమిదో వార్డుకు సంబంధించిన మూడు సచివాలయాలను పీహెచ్‌సీ భవనంలో ఏర్పాటుచేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మూడు కూడా మూతపడి ఉన్నాయి. అక్కడ సమాధానం చెప్పడానికి కూడా ఎవరూ అందుబాటులో లేరు. దీంతో వివిధ పనులపై వచ్చినవారు నిరాశతో వెనుతిరిగారు. ఈ విషయమై సిబ్బందిని ఫోన్‌లో వివరణ కోరగా ఒక కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఏ ప్రమాదం జరగకుండా ముందస్తుగా తాళాలు వేసినట్టు చెప్పుకొచ్చారు. అందులో ఎంతవరకూ వాస్తవం ఉందనేది అధికారులు విచారిస్తే గానీ తేలదు.
-సాగర్‌నగర్/ఆంధ్రజ్యోతి