Share News

ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:08 AM

ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన హుకుంపేట మండలం గడికించుమండ పంచాయతీ గడ్డిమర్రి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ప్రాణం తీసిన ఈత సరదా
ఇద్దరు బాలురు మృతికి కారణమైన పంట కుంట ఇదే

పంటకుంటలో ఇద్దరు బాలురు మృతి

- గడ్డిమర్రి గ్రామంలో విషాదం

హుకుంపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన హుకుంపేట మండలం గడికించుమండ పంచాయతీ గడ్డిమర్రి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గడికించుమండ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న గెమ్మెలి అఖిల్‌ (8), గెమ్మెలి సంతోశ్‌ (8)లు మంగళవారం సాయంత్రం పాఠశాల విడిచిపెట్టిన తరువాత సమీపంలోనే ఉన్న స్వగ్రామం గడ్డిమర్రికి చేరుకున్నారు. అయితే ఆ సమయంలో వాళ్ల తల్లిదండ్రులు పొలం పనుల్లో ఉండడంతో బాలురు అక్కడకు బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో ఉన్న పంటకుంటలో ఈత కోసం దిగారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటకుంటలో నీళ్లు అధికంగా ఉండడంతో అఖిల్‌, సంతోశ్‌లు మునిగిపోయారు. దీనిని గమనించిన స్థానికులు వారిద్దరినీ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నీటిలో మునిగిపోయి ఊపిరాడక బాలురు ప్రాణాలు కోల్పోయారు. అనుకోని విధంగా ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో గడ్డిమర్రి గ్రామంలో విషాదం అలముకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:08 AM