న్యాయవాదులకు నైతికత, సమగ్రత అవసరం
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:12 AM
న్యాయవాద వృత్తిలో రాణించేందుకు న్యాయవాదులకు నైతికతతో పాటు సమగ్రత అవసరమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు.
సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు
సబ్బవరం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : న్యాయవాద వృత్తిలో రాణించేందుకు న్యాయవాదులకు నైతికతతో పాటు సమగ్రత అవసరమని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో బార్ కౌన్సిల్ సమావేశం రెండో రోజైన శుక్రవారం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలంటే సహనం, కృషి ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితులో మధ్యవర్తిత్వానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తులకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఉండాలన్నారు. అనంతరం జస్టిస్ నాగేశ్వరరావును వీసీ ప్రొఫెసర్ సూర్యప్రకాశరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి, రాష్ట్ట బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సిరపరపు కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్(ఏపీ) అల్లూరి రామిరెడ్డి, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, రాష్ట్ర బార్ కౌన్సిల్ విశాఖపట్నం సభ్యులు పి.నరసింగరావు, గంటా రామారావు, కీర్తి రామజోగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.