Share News

పాడేరు ఆస్పత్రిలో లాప్రోస్కోపీ సర్జరీలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:54 PM

స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్య నిపుణులు లాప్రోస్కోపీ సర్జరీలు ప్రారంభించారు.

పాడేరు ఆస్పత్రిలో లాప్రోస్కోపీ సర్జరీలు
పాడేరు ఆస్పత్రిలో లాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్న వైద్య నిపుణులు

వైద్య బృందాన్ని అభినందించిన

జీఎంసీ ప్రిన్సిపాల్‌ హేమలత

పాడేరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్య నిపుణులు లాప్రోస్కోపీ సర్జరీలు ప్రారంభించారు. వైద్యులకు క్లిస్టమైన, రోగులకు ఎంతో సౌకర్యవంతమైన లాప్రోస్కోపీ సర్జరీలు పాడేరులోనే జరగడంపై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డి.హేమలత వైద్య బృందాన్ని అభినందించారు. వాస్తవానికి లాప్రోస్కోపీ సర్జరీ కాకుండా సాధారణ సర్జరీ నిర్వహిస్తే సదరు రోగి కనీసం 10 నుంచి 15 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థిఽతి ఉంటుందని, కాని లాప్రోస్కోపీ సర్జరీతో రోగికి రెండు రోజుల విశ్రాంతి సరిపోతుందని ప్రిన్సిపాల్‌ హేమలత తెలిపారు. అలాగే ఇటువంటి సర్జరీల కోసం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారంతా కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇక్కడే వాటిని నిర్వహించడంతో గిరిజన రోగులకు లాప్రోస్కోపీ సర్జరీలు మరింత అందుబాటులోకి వచ్చినట్లేనన్నారు. సర్జరీ విభాగపతి డాక్టర్‌ శ్రీనివాసరావు, మత్తు నిపుణులు సతీశ్‌బాబు, బృందం డాక్టర్లు రమేశ్‌కుమార్‌, రత్నకిశోర్‌, విజయ్‌, అనూప్‌లను జీఎంసీ ప్రిన్సిపాల్‌ హేమలత ప్రత్యేకంగా అభినందించారు. పాడేరు ఆస్పత్రిలోనే ఇటువంటి సర్జరీలను నిర్వహించడం ద్వారా గిరిజన రోగులకు భరోసా కల్పించడంతోపాటు లాప్రోస్కోపీ సర్జరీల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈఅవకాశాన్ని మన్యం ప్రాంతీయులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యలు కోరారు.

Updated Date - Sep 06 , 2025 | 11:54 PM