Share News

చెరువులో దిగి అనంత లోకాలకు..

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:00 PM

కలువ పూల సేకరణకు చెరువులో దిగిన ఓ యువకుడు ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

చెరువులో దిగి అనంత లోకాలకు..
మృతుడు సంజీవరావు (ఫైల్‌ ఫొటో)

కలువ పూల సేకరణకు వెళ్లి ఊబిలో చిక్కుకుని యువకుడి మృతి

డుంబ్రిగుడ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): కలువ పూల సేకరణకు చెరువులో దిగిన ఓ యువకుడు ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. అరమ పంచాయతీ డుంబ్రివలస గ్రామానికి చెందిన పాంగి సంజీవరావు(21) ఆదివారం గ్రామ సమీపంలో గల నందివలస చెరువులో కలువ పూలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్లాడు. పూలు కోయడానికి చెరువులో దిగాడు. కొన్ని అడుగులు వేశాక ఊబిలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఊబిలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. ఇంటి నుంచి వెళ్లి ఎంత సేపైనా అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చుట్టుపక్కల గాలించారు. చెరువు ఒడ్డున అతని దుస్తులు, చెప్పులు ఉండడాన్ని గమనించారు. వారు చెరువులో గాలించగా అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తరలించిన అనంతరం అంత్యక్రియలు చేశారు. అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - Sep 28 , 2025 | 11:00 PM