Share News

భూ ఆక్రమణల తొలగింపు పక్కాగా జరగాలి

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:22 PM

ప్రభుత్వ భూముల ఆక్రమణలను పక్కాగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

భూ ఆక్రమణల తొలగింపు పక్కాగా జరగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన డీఆర్‌వో పద్మలత

అధికారులకు కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశం

కేసులున్న భూములపై కోర్టుల ఆదేశాలు పాటించాలి

ఆక్రమణదారులకు నోటీసులు జారీ తప్పనిసరి

తర్వాత ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి

పాడేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూముల ఆక్రమణలను పక్కాగా తొలగించాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూఆక్రమణలపై తహశీల్దార్లు, ఎంపీడీవోలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ఆయన మాట్లాడారు. కేసులున్న భూములపై కోర్టుల ఆదేశాల మేరకు వ్యవహరించాలన్నారు. అలాగే ప్రభుత్వ భూములు, బంజరు భూములు, నీటి వనరుల ఆక్రమణలను విధిగా తొలగించాలన్నారు. ఆక్రమణదారులకు తొలుత ఫారం 6, ఫారం 7 నోటీసులు జారీ చేయాలని, ఆక్రమణల తొలగింపునకు జిల్లా కలెక్టర్‌ లేదా సబ్‌ కలెక్టర్ల అనుమతులు తీసుకోవాలన్నారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ఈనెల 10న అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీట్‌ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆయా కార్యకమ్రాల్లో ఎంపీడీవోలు, తహశీల్దార్లు పాల్గొని విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 11:22 PM