Share News

పరిరక్షణ ప్రాంతంగా కొండకర్ల ఆవ

ABN , Publish Date - May 28 , 2025 | 12:26 AM

అచ్యుతాపురం, మునగపాక మండలాల సరిహద్దులో వున్న కొండకర్ల ఆవను వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌-1972 కింద కన్జర్వేషన్‌ రిజర్వుగా (పరిరక్షణ ప్రాంతం) ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు.

పరిరక్షణ ప్రాంతంగా కొండకర్ల ఆవ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలి

ఆవ నీరు కలుషితం కాకుండా చర్యలు

పర్యాటకాభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేయాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

అనకాపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం, మునగపాక మండలాల సరిహద్దులో వున్న కొండకర్ల ఆవను వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌-1972 కింద కన్జర్వేషన్‌ రిజర్వుగా (పరిరక్షణ ప్రాంతం) ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. దీనిపై మంగళవారం కలెక్టరేట్‌లో అటవీ, పంచాయతీ, ఇరిగేషన్‌, మత్స్య, పర్యాటక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొండకర్ల ఆవను సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. ఆవ గట్లను పటిష్ఠం చేయాలని, మురుగు నీరు ఆవలో కలవకుండా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెత్తాచెదారాన్ని ఆవలో వేయకుండా నియంత్రించాలన్నారు. రిసార్ట్స్‌ నిర్మాణం, రిక్రియేషన్‌, బోటింగ్‌, జెట్టీ నిర్మాణం వంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డీపీఓ శిరీషారాణి, ఇన్‌చార్జి టూరిజం అధికారి డీసీకే మనోరమ, జిల్లా మత్స్య శాఖాధికారి ప్రసాద్‌, సామాజిక అటవీ విభాగం డీఎఫ్‌ఓ లక్ష్మణ్‌, సబ్‌ డీఎఫ్‌ఓ సునీల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:26 AM