నేడు డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా కోన తాతారావు బాధ్యతలు స్వీకరణ
ABN , Publish Date - Jun 02 , 2025 | 01:00 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జిగా కోన తాతారావు సోమవారం మఽధ్యాహ్నం 12 గంటలకు మర్రిపాలెంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు.
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పర్సన్ ఇన్‌చార్జిగా కోన తాతారావు సోమవారం మఽధ్యాహ్నం 12 గంటలకు మర్రిపాలెంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. గాజువాకలో జనసేన పార్టీకి చెందిన తాతారావును ప్రభుత్వం డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జిగా నియమిస్తూ రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి సంబంధించి కూటమి నాయకులకు ఆహ్వానాలు అందాయి. డీసీసీబీ అధికారులు ప్రధాన కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు.