Share News

కిరండూల్‌ రైళ్ల గమ్యం కుదింపు

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:09 AM

కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైనులో ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో విశాఖ-కిరండూల్‌ మధ్య రాకపోకలు సాగించే రైళ్ల గమ్యాలను తాత్కాలికంగా కుదించామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

కిరండూల్‌ రైళ్ల  గమ్యం కుదింపు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి):

కొత్తవలస-కిరండూల్‌ (కేకే) లైనులో ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో విశాఖ-కిరండూల్‌ మధ్య రాకపోకలు సాగించే రైళ్ల గమ్యాలను తాత్కాలికంగా కుదించామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. విశాఖ-కిరండూల్‌ మధ్య నడిచే 58501, 58502 నంబర్లు గల పాసింజర్‌ రైళ్లు ఈ నెల 14 నుంచి 22 వరకు విశాఖ-అరకు మధ్య రాకపోకలు సాగిస్తాయని ఆయన పేర్కొన్నారు. అరకు-కిరండూల్‌ మధ్య రాకపోకలను రద్దు చేశామన్నారు. అలాగే విశాఖ-కిరండూల్‌ మధ్య నడిచే 18515, 18516 నంబర్లు గల నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 15 నుంచి 23 వరకు విశాఖ-దంతెవాడ మధ్య నడుస్తాయన్నారు. దంతెవాడ-కిరండూల్‌ మధ్య రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని కోరారు.

Updated Date - Apr 10 , 2025 | 01:09 AM