Share News

జాతీయ పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:41 AM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో అండర్‌ - 14 బాలుర, బాలికల జాతీయ స్థాయి ఖోఖో జట్లను లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి ఎంపిక చేశారు.

జాతీయ పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక
జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికైన బాలుర జట్టుతో డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, తదితరులు

లంకెలపాలెం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో అండర్‌ - 14 బాలుర, బాలికల జాతీయ స్థాయి ఖోఖో జట్లను లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి ఎంపిక చేశారు. మూడు రోజులు పాటు ఇక్కడ జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో విశేషంగా రాణించిన క్రీడాకారులను ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెలాఖరులో రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో ఏపీ నుంచి రెండు జట్లు పాల్గొంటాయని ఎస్‌జీఎఫ్‌ ప్రతినిధులు తెలిపారు. కాగా ఎంపికైన క్రీడాకారులను జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు, కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌లు అభినందించారు. ఈకార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కేఎం నాయుడు, హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, ఎస్‌జీఎఫ్‌ మాజీ కార్యదర్శి ఎంవీ. నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన బాలుర జట్టు

జె.హర్షవర్ధన్‌(విశాఖపట్నం), జి.మనోహర్‌నాయుడు(విశాఖపట్నం), టి.సూర్యనారాయణ(చిత్తూరు), ఎస్‌.బద్రీనాథ్‌(చిత్తూరు), టి.శృతిసాయి కీర్తన్‌(విశాఖపట్నం), ఎం.శ్రీకాంత్‌(గుంటూరు), సి.నగేశ్‌(కర్నూల్‌), కె.వెంకటసాయి(ప్రకాశం), ఎ.భూపతిరెడ్డి(తూర్పుగోదావరి), బి.కార్తీక్‌(శ్రీకాకుళం), ఎస్‌.రామ్‌చరణ్‌(కడప), కె.చరణ్‌(విశాఖపట్నం).

బాలికల జట్టు

ఆర్‌.సృతిక(విశాఖపట్నం), ఆర్‌.లలితాదేవి(విశాఖపట్నం), ఎం.యువశ్రీ(చిత్తూరు), పి.జయశ్రీ(చిత్తూరు), ఎన్‌.అర్చనారెడ్డి(చిత్తూరు), జి.చందన(శ్రీకాకుళం), కె.పావని(విజయనగరం), టి.సింధు(ప్రకాశం.), ఎన్‌.బంధవిక(కృష్ణా), జి.అనుపమ(కడప), ఆర్‌.వీణ(అనంతపురం), టి.ప్రియ(తూర్పుగోదావరి).

Updated Date - Dec 02 , 2025 | 12:41 AM