Share News

అల్లుపురంలో కేజీహెచ్‌ బృందం

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:40 AM

మండల కేంద్రానికి శివారున వున్న అల్లుపురంలో గ్రామాన్ని గురువారం కేజీహెచ్‌కు చెందిన ర్యాపిడ్‌ రెస్పాండ్‌ బృందం సందర్శించింది. స్క్రబ్‌ సైఫస్‌ లక్షణాలతో వృద్ధుడు మృతిచెందినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు స్పందించించారు.

అల్లుపురంలో కేజీహెచ్‌ బృందం
అల్లుపురంలో మృతిచెందిన వృద్ధుడి ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న కేజీహెచ్‌ బృందం

స్క్రబ్‌ సైఫస్‌తో వృద్ధుడి మృతిపై ఆరా

గ్రామంలో ఇంటింటా ఫీవర్‌ సర్వే

దేవరాపల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి శివారున వున్న అల్లుపురంలో గ్రామాన్ని గురువారం కేజీహెచ్‌కు చెందిన ర్యాపిడ్‌ రెస్పాండ్‌ బృందం సందర్శించింది. స్క్రబ్‌ సైఫస్‌ లక్షణాలతో వృద్ధుడు మృతిచెందినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు స్పందించించారు. గ్రామానికి వచ్చిన కేజీహెచ్‌ బృందం వృద్ధుడి నివాస ప్రాంతాన్ని పరిశీలించి ఆయన మృతికిగల కారణాలపై వైద్య నిపుణులు రామారావు, విజయ్‌, యోగిత ఆరా తీశారు. ఎన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు? ఎక్కడ వైద్యం చేయించారు? వంటి వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. స్క్రబ్‌ సైఫస్‌తో మృతిచెందలేదని భావిస్తున్నామని, దీర్ఘ కాలిక వ్యాధితో చనిపోయాడని వారు చెప్పారు. తరువాత గ్రామంలో ఇంటింటికీ వెళ్లి స్క్రబ్‌ సైఫస్‌ బ్యాక్టీరియా లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నారా అన్నదానిపై ఆరా తీశారు. పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో ఫీవర్‌ సర్వే చేయించారు. వీరి వెంట పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ పూజ్య మేఘన వున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 12:40 AM