కేజీబీవీ ఎస్‌వో సస్పెన్షన్
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:32 AM
కొయ్యూరు కస్తూర్బా విద్యాలయం ఎస్‌వో ఎ.పరిమళను సస్పెండ్ చేస్తూ సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ)డి.స్వామినాయుడు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
సరుకులు అక్రమంగా తరలిస్తున్నట్టు తేలడంతో చర్యలు
కొయ్యూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కొయ్యూరు కస్తూర్బా విద్యాలయం ఎస్‌వో ఎ.పరిమళను సస్పెండ్ చేస్తూ సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ (ఏపీసీ)డి.స్వామినాయుడు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కొయ్యూరు కేజీబీవీలోని సరుకులను ఎస్‌వో ఈ నెల 21న అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ మర్నాడు సర్వశిక్షా అభియాన్ జీసీడీవో కల్పన ప్రాథమిక విచారణ జరిపారు. అనంతరం ఈ నెల 24న సర్వశిక్షా అభియాన్ రీజనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ దాసరి స్వామినాయుడు మరోసారి విచారణ జరిపారు. ఇదే పాఠశాలలోని రెండు గదుల్లో 15 బస్తాల బియ్యం అక్రమంగా నిల్వ చేయడాన్ని గుర్తించారు. విచారణ సమయంలో ఎస్‌వో పరిమళ ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిమళను సస్పెండ్ చేస్తున్నట్టు ఎంఈవో రాంబాబుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయాన్ని ఏపీసీ ధ్రువీకరించారు.