రాష్ట్రస్థాయి జూడో, కుస్తీ పోటీలకు కశింకోట విద్యార్థులు ఎంపిక
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:28 AM
మండల కేంద్రంలోని డీపీఎన్ జల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ నెల 4న విశాఖ నగరంలోని గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి జూడో, కుస్తీ పోటీల్లో సత్తా చాటారు.
కశింకోట, అక్టోబర్ 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని డీపీఎన్ జల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ నెల 4న విశాఖ నగరంలోని గోపాలపట్నం జడ్పీ ఉన్నత పాఠశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి జూడో, కుస్తీ పోటీల్లో సత్తా చాటారు. జూడో పోటీల్లో బాలుర అండర్-14 విభాగంలో 7వ తరగతి విద్యార్థి ఎస్.పవన్ స్వర్ణ పతకం, అండర్-17 విభాగంలో పదో తరగతి విద్యార్థి జె.రామ్‌చరణ్, సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా ఖాదరి స్వర్ణ పతకాలు, పదో తరగతి విద్యార్థులు వై.కోటేశ్వరరావు, ఎన్.మధు రజత పతకాలు సాధించారు. కుస్తీ పోటీల్లో 9వ తరగతి విద్యార్థి డి.లోకేశ్, పదో తరగతి విద్యార్థి అబ్దుల్ అజీజ్ షా ఖాదరి స్వర్థ పతకాలు, పదో తరగతి విద్యార్థి వై.కోటేశ్వరరావు, 9వ తరగతి విద్యార్థి బి.ప్రవీణ్ రజత పతకాలు సాధించారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్‌ఎం ఎన్‌జీవీ ప్రసాద్ తెలిపారు.