Share News

ఆదివాసీల ఖ్యాతిని నిలిపిన కరుణకుమారి

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:54 PM

ఆదివాసీల ఖ్యాతిని నిలిపిన క్రీడాకారిణి కరుణకుమారి అని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు.

ఆదివాసీల ఖ్యాతిని నిలిపిన కరుణకుమారి
మహిళా క్రికెటర్‌ కరుణకుమారిని సన్మానించిన నాయకులు

టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి

పాడేరురూరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల ఖ్యాతిని నిలిపిన క్రీడాకారిణి కరుణకుమారి అని తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు. అంధుల మహిళా క్రికెట్‌ ప్రపంచ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యురాలు అయిన కరుణకుమారికి శుక్రవారం పాడేరులో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ విజయోత్సవ అభినందన ర్యాలీ నిర్వహించారు. తొలుత మోదకొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ మానసికంగా, ఆర్థికంగా ఉన్న వారుకూడా సాధించని విజయాన్ని నిరుపేదరాలైన అంధురాలు కరుణ కుమారి సొంతం చేసుకొని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆదివాసీ జాతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన కరుణకుమారి తల్లిదండ్రులకు జాతి మొత్తం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు ఎం.తేజోవతి కరుణకుమారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో బొర్రా నాగరాజు, డి.వెంకటరమణ, డీవీ.కుమారి, వంట్లమామిడి సర్పంచ్‌ పి.రాంబాబు, టీడీపీ అరకు పార్లమెంట్‌ దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడు వై.అప్పారావు, టీడీపీ నాయకులు, క్రీడాభిమానులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 10:54 PM