కరుణకుమారికి రూ.5 లక్షల ప్రోత్సాహకం
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:59 AM
భారత అంధుల మహిళా జట్టు టీ 20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణకుమారికి కిషోర్ గ్రానైట్స్ అధినేత గొట్టిపాటి హర్ష రూ.5 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు.
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారత అంధుల మహిళా జట్టు టీ 20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరుణకుమారికి కిషోర్ గ్రానైట్స్ అధినేత గొట్టిపాటి హర్ష రూ.5 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమశాఖా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరుణకుమారి విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులను ప్రోత్సహించిన హర్షను మంత్రి అభినందించారు.
స్టూడెంట్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా నగర విద్యార్థి మరొకరు చీఫ్ మార్షల్...
నేడు పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవం
విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం విజయవాడలో నిర్వహించనున్న స్టూడెంట్ అసెంబ్లీలో విశాఖ విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా శ్రీకృష్ణాపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కోడి యోగి వ్యవహరిస్తారు. అలాగే సభాపతికి సహాయం చేసే చీఫ్ మార్షల్‌గా అక్కయ్యపాలెం ఎన్జీవో కాలనీ జీవీఎంసీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి వి.హర్షవర్దన్ విధులు నిర్వహించనున్నారు. జిల్లా నుంచి ఎంపికైన ఎనిమిది మందిలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలుగా, ఒకరు మార్షల్‌గా అసెంబ్లీకి హాజరవుతారు. ఇదిలావుండగా బుధవారం జిల్లాలో అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ వచ్చిన ఉత్తర్వులను ప్రధానోపాధ్యాయులకు పంపినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ప్రతి పాఠశాలలో ఉదయం 11గంటలకు విద్యార్థులను సమావేశపరిచి రాజ్యాంగ పీఠిక పఠనం చేయించాలని సూచించారు. భారత రాజ్యాంగం ప్రవేశికలో ఉన్న పీఠిక పఠనం గొప్పతనం, ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. స్టేట్ అసెంబ్లీకి జిల్లా నుంచి ఎంపిక చేసిన 21 మందిలో ఎనిమిది మంది విజయవాడ వెళ్లగా, మిగిలిన 13 మందిని బుధవారం ఉదయం కలెక్టరేట్‌లో సత్కరిస్తారు. ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్, పతకం కలెక్టర్ అందజేస్తారని డీఈవో తెలిపారు.