ఉమా రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:13 AM
మండలంలోని కాశీపట్నం ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అనంత్ రామ్‌నాథ్ హెగ్డే కుటుంబ సమేతంగా గురువారం సందర్శించారు.
అనంతగిరి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కాశీపట్నం ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అనంత్ రామ్‌నాథ్ హెగ్డే కుటుంబ సమేతంగా గురువారం సందర్శించారు. ముందుగా ఆయనకు డ్వాక్రా మహిళలు హారతి ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శివాలయం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయనగరం జిల్లా గంట్యాడ పరిధిలోగల తాటిపూడి జలాశయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆయన వెంట తహశీల్దార్ వీరభద్రాచారి, అనంతగిరి పోలీసులు ఉన్నారు.