జాయింట్ కలెక్టర్ బదిలీ
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:18 AM
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అభిషేక్‌గౌడ గత ఏడాది జూలైలో అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వివాదరహితుడిగా విధులు నిర్వహిస్తారన్న పేరుంది.
ఏలూరు జిల్లా జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు
ఐటీడీఏ పీవో శ్రీపూజకు ఇన్‌చార్జి బాధ్యతలు
పాడేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అభిషేక్‌గౌడ గత ఏడాది జూలైలో అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వివాదరహితుడిగా విధులు నిర్వహిస్తారన్న పేరుంది. కాగా ఐటీడీఏ పీవో టి.శ్రీపూజకు జాయింట్ కలెక్టర్‌గా ఇన్‌చార్జి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఆమె పాడేరు సబ్‌కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్‌గా కూడా విధులు నిర్వహించాలి. ఐటీడీఏ పీవోగా ఉన్న అధికారికి మరో రెండు కీలకమైన పోస్టులను అప్పగించడం ఇదే ప్రథమం.