పీపీపీ విధానంపై జగన్‌రెడ్డికి అవగాహన లేదు
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:05 AM
పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్‌రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. అనకాపల్లి జిల్లా రావికమతంలో శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ విధానంపై అవగాహన లేకనే జగన్మోహన్‌రెడ్డి నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్...తిరిగి మెడికల్ కాలేజీల పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టి రాష్ర్టాన్ని రావణ కాష్టంలా మార్చాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం
జగన్ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు
అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్
రావికమతం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్‌రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. అనకాపల్లి జిల్లా రావికమతంలో శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ విధానంపై అవగాహన లేకనే జగన్మోహన్‌రెడ్డి నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్...తిరిగి మెడికల్ కాలేజీల పేరుతో మరోమారు ప్రజలను మభ్యపెట్టి రాష్ర్టాన్ని రావణ కాష్టంలా మార్చాలని యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీలు కనీసం 20 శాతం కూడా పూర్తికాలేదన్నారు. ‘ఏ ప్రభుత్వం వచ్చినా మోయలేనన్ని అప్పులు చేశావు. ఒక్క రోడ్డయినా వేశావా? ఒక్క గొయ్యనైనా పూడ్చావా?, ఏం అభివృద్ధి చేశావని ప్రజల వద్దకు వచ్చావు? అంటూ జగన్‌ను ఆయన ప్రశ్నించారు. కొవిడ్ సమయంలో వైద్యులకు మాస్క్‌లు కూడా ఇవ్వలేని పాలన సాగించిన జగన్‌కు, ఇప్పుడు మెడికల్ కాలేజీలు గుర్తుకొచ్చాయా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులతో..ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఆమలు చేస్తున్నారన్నారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు దూసుకుపోతున్నాయని ఎంపీ రమేశ్ కొనియాడారు. జగన్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఎంత యత్నించినా, ఎవరూ నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి వంకర బుద్ధులు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు పాల్గొన్నారు.