Share News

బడి పండుగకు వేళాయె

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:02 AM

జిల్లాలో గురువారం మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. దీని కోసం పాఠశాలలు సిద్ధమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాఠశాలల్లో పిల్లల చదువులు, ఆరోగ్యం, బాగోగుల కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించే కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ఈసారి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోనూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 2,232 పాఠశాలల్లో 1.87 లక్షల మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరు కానున్నారు.

బడి పండుగకు వేళాయె
గురువారం జరగనున్న మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌కు హారతులు, పుష్పాలతో తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్న రోలుగుంట మండలం వెలంకాయలపాలెం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల వైస్‌ చైౖర్మన్‌ ఆదిలక్ష్మి, విద్యార్థులు

- నేడు మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌

- జిల్లా వ్యాప్తంగా 2,232 పాఠశాలల్లో నిర్వహణ

- విద్యాలయాల్లో పండుగ వాతావరణం

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గురువారం మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. దీని కోసం పాఠశాలలు సిద్ధమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాఠశాలల్లో పిల్లల చదువులు, ఆరోగ్యం, బాగోగుల కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో చర్చించే కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ఈసారి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోనూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 2,232 పాఠశాలల్లో 1.87 లక్షల మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరు కానున్నారు. 134 జూనియర్‌ కళాశాలల్లో 24,781 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి బడుల అభివృద్ధికి చర్చించనున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తారు. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో మొక్కలు నాటించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - Jul 10 , 2025 | 01:02 AM