Share News

ఇది రోడ్డా.. చెరువా?

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:41 AM

పట్టణ శివారులో అటవీ శాఖ కార్యాలయం సమీపంలో గల ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది రోడ్డా.. చెరువా?
చోడవరం శివారు అటవీశాఖ కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై నిలిచిపోయిన వర్షపు నీరు

చోడవరం శివారులో చెరువును తలపిస్తున్న రహదారి

ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యంతో వాహనచోదకుల పాట్లు

చోడవరం, జూలై 2(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులో అటవీ శాఖ కార్యాలయం సమీపంలో గల ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఈ రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా పక్కనున్న పంట కాలువలోకి పోయే పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల ఈ రోడ్డు పక్కన పొలాలు ఉన్న రైతు ఒకరు వర్షపు నీరు పోయే మార్గాన్ని కప్పివేయడంతో రోడ్డుపైనే నిలిచిపోతోంది. అయితే ఆర్‌అండ్‌బీ అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రోడ్డుపై నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:41 AM