Share News

నేడు రైతులకు పెట్టుబడి సాయం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:51 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రధానమంత్రి కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ పథకాల కింద రైతులకు పెట్టుబడి సాయం నిధులు విడుదల చేశాయి. జిల్లాలో 2,42,480 మంది రైతులకు రూ.158.4 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో తొలి విడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేల చొప్పున ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు పథకాల ద్వారా 2,42,536 మంది రైతులకు రూ.161.45 కోట్లు అందాయి. తా

నేడు రైతులకు పెట్టుబడి సాయం

అన్నదాత సుఖీభవ రెండో విడత, పీఎం కిసాన్‌ 21వ విడత నిధులు విడుదల

2,42,480 మందికి రూ.158.4 కోట్లు

నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ

సబ్బవరంలో జిల్లాస్థాయి సభ

అనకాపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రధానమంత్రి కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ పథకాల కింద రైతులకు పెట్టుబడి సాయం నిధులు విడుదల చేశాయి. జిల్లాలో 2,42,480 మంది రైతులకు రూ.158.4 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో తొలి విడతగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేల చొప్పున ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు పథకాల ద్వారా 2,42,536 మంది రైతులకు రూ.161.45 కోట్లు అందాయి. తాజాగా బుధవారం పీఎం కిసాన్‌ 21వ విడత కింద రూ.2 వేలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 2వ విడత అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలో పీఎం కిసాన్‌ యోజన కింద 1,85,754 మందికి రూ.37.16 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద 2,42,480 మంది రైతులకు రూ.121.24 కోట్లు... మొత్తం రూ.158.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 17,045 మంది రైతులకు రూ.14.6 కోట్లు, చోడవరం నియోజకవర్గంలో 39,213 మంది రైతులకు రూ.33.5 కోట్లు, మాడుగులలో 35,065 మందికి రూ.29.7 కోట్లు, నర్సీపట్నంలో 28,017 మందికి రూ.23.1 కోట్లు, పాయకరావుపేటలో 29,645 మందికి రూ.25.6 కోట్లు, ఎలమంచిలిలో 24,859 మందికి రూ.21.9 కోట్లు, పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం, పరవాడ మండలాల్లో 11,941 మంది రైతులకు రూ.10.1 కోట్లు అందనున్నాయి. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు విడుదల చేయడం సంతోషంగా వుందని పలువురురైతులు చెబుతున్నారు.

సబ్బవరంలో సభ

అన్నదాత సుఖీభవ 2వ విడత, పీఎం కిసాన్‌ 21వ విడత నిధుల విడుదల సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో బుధవారం మధ్యాహ్నం జిల్లాస్థాయి సభను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ గండి బాబ్జీ హాజరవుతారని పేర్కొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 12:51 AM